ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిరాశకు గురైంది. పద్మ భూషణ్ అవార్డు కోసం సైనా దాఖలు చేసిన దరఖాస్తును ప్రమాణాలను సాకుగా చూపుతూ కేంద్రం తిరస్కరించింది. భారత బ్యాడ్మింటన్ సంఘం గత ఏడాది ఆగస్టులో ఆమె పేరును క్రీడల మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. అయితే, కేంద్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఎంపిక చేసింది. సుశీల్ ఈ అవార్డుకు అన్నివిధాలా అర్హుడని భావించింది.
దీనిపై సైనా స్పందిస్తూ, "ప్రత్యేకమైన కేసుగా పరిగణించి సుశీల్ కుమార్ పేరును ఈ అవార్డుకు ప్రతిపాదించారు. అయితే, క్రీడల మంత్రిత్వ శాఖ నా పేరును మాత్రం హోం శాఖకు పంపలేదు. మంత్రిత్వ శాఖ నిబంధనలు 'పద్మ' అవార్డులకు మధ్య ఎడం ఐదేళ్లు ఉండాలని సూచిస్తున్నాయి. అలాంటప్పుడు అతని పేరు పంపిన వాళ్లు, నా పేరును ఎందుకు రికమెండ్ చేయలేదు? నేను పద్మశ్రీ అందుకుని ఐదేళ్లయింది. పద్మ భూషణ్ అందుకునేందుకు ఆ విధంగా నేను అర్హురాలినే. దీనిపై ఎంతో అసంతృప్తికి లోనయ్యా" అని ఆవేదన వ్యక్తం చేసింది. సైనా 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది. కాగా, కిందటేడాది కూడా తనకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని సైనా వాపోయింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి