పాకిస్థాన్ కు చెందినదిగా భావిస్తున్న బోటు డిసెంబర్ 31న భారత సముద్ర జలాల్లో ప్రవేశించడం, దాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంబడించడం, ఆ బోటులోని సిబ్బంది తమను తాము పేల్చేసుకోవడం తెలిసిందే. అయితే, ఈ ఆపరేషన్ మొత్తం 18 గంటల పాటు సాగిందట. ఆ రోజు ఉదయం 9.30కి అనుమానాస్పద బోటు గురించి నిఘా సంస్థలు ఇండియన్ కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించాయి. పాక్ నుంచి వచ్చిన కొన్ని ఫోన్ కాల్స్ ఆధారంగా బోటు వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించారు. ఆ వెంటనే నేవీకి చెందిన డోర్నియర్ విమానంతో ఆ బోటును వెదికేందుకు రంగంలోకి దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆ బోటును గుర్తించారు.
అప్పటికే అది భారత సముద్ర జలాల్లో ప్రవేశించింది. దీంతో, కోస్ట్ గార్డ్ కు చెందిన రాజ్ రతన్ నౌకను ఆ బోటును వేటాడేందుకు పంపారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది హెచ్చరికలు చేయడంతో బోటును దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అందులోని దుండగులు. 'కోస్ట్ గార్డ్' నుంచి తప్పించుకునేందుకు పలుమార్లు దిశను మార్చుకునే యత్నం చేశారు. ఇలా, గంటసేపు సాగింది. ఇంధనం అయిపోవడంతో బోటును నెమ్మదిగా నడిపారు. చివరకు తెల్లవారుజామున 3.00 గంటల వేళ బోటు పైభాగంలోకి నలుగురు వ్యక్తులు రాగా, ఆ వెంటనే బోటు పేలిపోయింది. కావాలనే వారు తమను తాము పేల్చేసుకున్నారని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి