ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఏపీ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న పవన విద్యుత్ సంస్థకు స్థలం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. పెండింగ్ లో ఉన్న 41 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అదనపు నిధులు అవసరమని మంత్రి వర్గం అభిప్రాయపడింది.
వీటికి 7 వేల కోట్లు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. జలయజ్ఞం పనులు చేపట్టిన గుత్తేదారులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన మంత్రి వర్గం, సకాలంలో పనులు పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి వర్గం చర్చించింది. అధికారుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, దానిని సరిదిద్దాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
ఈ నెల 18న స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. డ్వాక్రా రుణ మాఫీకి మహిళా సాధికార కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని, ఏక గవాక్ష విధానంలో పరిశ్రమల అనుమతులకు ఆమోదించారు. కాగా, పూర్తి పారిశ్రామిక విధానాన్ని వచ్చే మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించాలని నిర్ణయించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి