భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్ర మార్గాన్నే నమ్ముకుంటున్నారు. దీంతో తూర్పుతీరం సురక్షితమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నౌకాదళం కలిగిన దేశాల్లో ఒకటైన భారత నౌకా దళం, పాక్ తీవ్రవాదులు విసురుతున్న సవాళ్లను స్వీకరించగలదా? పాక్, శ్రీలంక, చైనా దేశాల నౌకాదళాల, మత్స్యకారుల ఉల్లంఘనలతో నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్న తీరరక్షక దళం సముద్ర మార్గాన వచ్చే తీవ్రవాదులను అడ్డుకోగలదా? అనే అనుమానాలు రేగుతున్నాయి.
తీర రక్షక దళం నిత్యం అప్రమత్తంగా ఉంటుందని, భారత జలాల్లో ఎవరు అక్రమంగా ప్రవేశించినా పసిగట్టే వ్యవస్థ భారత్ సొంతమని గతంలో పలు మార్లు నావికాదళాధికారులు తెలిపారు. అయితే 26/11 దాడులకు పాల్పడ్డప్పుడు పాక్ తీవ్రవాదులు సముద్ర మార్గాన్నే ఎంచుకోగా, తాజాగా పాక్ తీవ్రవాదులు గుజరాత్ లోని పోరుబందర్ సమీపంలోకి చొచ్చుకువచ్చారు. దీంతో తీరప్రాంతం సురక్షితమేనా? మత్స్యకారులు సమాచారం ఇస్తే తప్ప రక్షదళానికి సమాచారం చేరే మార్గం లేదా? అనే అనుమానం రేకెత్తుతోంది.
కాకుంటే సమాచారం అందిన వెంటనే నౌకాదళం క్షణాల్లో అప్రమత్తమవ్వడం కాస్త తృప్తి కలిగించే అంశమే. భవిష్యత్ లో సముద్ర మార్గంలో పాక్ తీవ్రవాదులు రాకుండా, వచ్చినా తెలిసిపోయేలా వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం తీవ్రతను పరిస్థితులు తెలియచెబుతున్నాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి