ఆసీస్ తో చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ గా విరాట్ కొహ్లీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దీంతో, వైస్ కెప్టెన్ ఎవరు? అనేది భారత క్రికెట్ లో ఆసక్తి రేపుతున్న చర్చ. దీంతో పలువురి పేర్లు వైస్ కెప్టెన్ రేసులో చక్కర్లు కొడుతున్నాయి. వైస్ కెప్టెన్ గా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, టాపార్డర్ బ్యాట్స్ మన్ అజింక్యా రహానే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా, 23 టెస్టులాడినప్పటికీ అశ్విన్ కు తుది జట్టులో చోటుదక్కడం అనుమానమే.
రహానే వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, జట్టులో నమ్మదగిన బ్యాట్స్ మన్ గా ఎదిగాడు. అయితే, తాజాగా, టీమిండియా టాప్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫేస్ బుక్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వైస్ కెప్టెన్ గా నియమితుడైనందుకు సహచరుడు ఇషాంత్ శర్మకు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు. దీంతో మరో చర్చకు తెరలేచినట్టయింది. అశ్విన్, రహానేలను కాదని వైస్ కెప్టెన్సీ ఇషాంత్ కు కట్టబెట్టారా? అంటూ క్రికెట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అన్నట్టు... ఇషాంత్, కోహ్లీ ఇద్దరూ ఢిల్లీ ఆటగాళ్లే.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి