'పీకే' చిత్రాన్ని డౌన్ లోడ్ చేసి చూశానంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చెప్పడం సామాజిక మీడియాలో వివాదాస్పదమైంది. డిసెంబర్ 31న ప్రెస్ కాన్ఫరెన్స్ లో అఖిలేశ్ మాట్లాడుతూ, "'పీకే' చూడమని చాలా రోజులుగా పలువురు నాకు చెబుతున్నారు. అందుకే కొన్ని రోజుల కిందట డౌన్ లోడ్ చేశాను, కానీ గత రాత్రి నాకు సమయం దొరకడంతో సినిమాను చూశాను. చాలా బాగా నచ్చింది. ప్రజలు కూడా చూడాలని వెంటనే పన్ను రాయితీ కల్పించాలని నిర్ణయించుకున్నా" అని తెలిపారు.
ఆ తరువాత ఆయనపై ట్విట్టర్ లో పైరసీ మాటల దాడి మొదలైంది. "పైరసీ వ్యతిరేక చట్టాలు చాలా ఉన్నాయి!" అని ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో "'పీకే'ను డౌన్ లోడ్ చేసి, చూసిన అఖిలేశ్ యాదవ్ పైరసీకి మద్దతు పలుకుతున్నారు. ఓ చిత్రాన్ని డౌన్ లోడ్ చేయడం తీవ్రమైన నేరం. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కచ్చితంగా చర్యలు తీసుకోవాలి" అని వ్యాఖ్యానించారు.
దాంతో జరిగిన నష్టాన్ని నియంత్రించేందుకు అఖిలేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఉదయం ఓ ట్వీట్ చేసింది. "అఖిలేశ్ యాదవ్ కు '@యుఎఫ్ఓమూవీజడ్' డీజీ ఫెసిలిటీ లైసెన్స్ ఉంది. అందులోనే డౌన్ లోడ్ చేసుకుని, మూవీ చూశారు" అని ట్వీట్ చేసింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి