విరాట్ కోహ్లీతో విభేదాలే ధోనీ రిటైర్మెంటుకు కారణమని వస్తున్న కథనాలపై టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి స్పందించాడు. ధోనీ, కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశాడు. "కోహ్లీయే కాదు, సహాయక సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సహా జట్టులోని ప్రతి ఒక్కరు ధోనీ ఆజ్ఞలను గౌరవిస్తారు. ధోనీ, కోహ్లీ ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనుకోలేదు. ఇదంతా నాన్సెన్స్" అని తెలిపాడు.
టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని ధోనీ తీసుకున్న నిర్ణయం జట్టునంతటినీ ఆశ్చర్యానికి గురిచేసిందని, పిడుగుపాటులా భావించామని చెప్పాడు. అయితే, తాను అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు శాస్త్రి పేర్కొన్నాడు. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత వ్యవహారమని, అత్యుత్తమ క్రీడాకారులకు తాము ఎప్పుడు నిష్క్రమించాలో తెలుసని అన్నాడు. ఆ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నిస్తారని అన్నారు. అతనేమీ 100 టెస్టుల రికార్డు, ఇతర గణాంక ఘనతల కోసం వేచి చూడలేదని, ఘనమైన వీడ్కోలు కోరుకోలేదని పరోక్షంగా సచిన్ కు చురకవేశాడీ ముంబైవాలా.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి