ఏపీ సీఎం చంద్రబాబునాయుడి అమోఘమైన జ్ఞాపకశక్తికి నిదర్శనంగా నిలిచే ఓ ఘటన గురువారం విజయవాడలో జరిగింది. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తనను కలిసిన ఓ వికలాంగుడిని చంద్రబాబు పేరు పెట్టి మరీ పిలిచారు. వివరాల్లోకెళితే... గతంలో సీఎంగా పనిచేసిన సమయంలో బెజవాడకు చెందిన వికలాంగుడు దుర్గారావు ఆయనను కలిశాడు. విద్యుత్ షాక్ కు గురైన దుర్గారావు రెండు చేతులను వైద్యులు మోచేతుల దాకా తీసేశారు. నాడు దుర్గారావును చంద్రబాబు పరామర్శించారు.
తాజాగా గురువారం నగరంలోని లబ్బీపేట వెంకటేశ్వరస్వామి గుడికి వెళుతున్న కాన్వాయ్ ను ఆపి చంద్రబాబుకు గ్రీటింగ్స్ చెప్పేందుకు దుర్గారావు యత్నించాడు. ఈ సమయంలో అతడిని పేరు పెట్టి పిలిచిన చంద్రబాబు, కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాక చదువు పూర్తికాగానే ఉద్యోగమిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం కలిసిన తనను చంద్రబాబు ఏకంగా పేరు పెట్టి పిలవడంతో దుర్గారావు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి