తెలంగాణలో చేపట్టనున్న వాటర్ గ్రిడ్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్ధిపేట సమగ్ర మంచినీటి పథకంపై తన కేబినెట్ సహచరులకు అవగాహన కల్పించిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్, వాటర్ గ్రిడ్ విజయం అధికారులపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ‘‘17 ఏళ్ల కిందట సిద్ధిపేటలో చేసింది, ఇప్పుడు చేయలేమా?’’అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రేయింబవళ్లు కష్టపడి అయినా వాటర్ గ్రిడ్ ను నాలుగేళ్లలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ‘‘అందరూ అసాధ్యమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసుకున్నాం. అలాగే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుదాం. ఇందుకు ప్రతి అధికారి అర్జునుడిలా మారాలి. అధికారులంతా చెమటచుక్కలు రాలిస్తేనే, ప్రజలకు కాసిన్ని మంచినీటి చుక్కలు అందుతాయి’’ అని కేసీఆర్ చెప్పారు. 1997లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమగ్ర మంచినీటి పథకమే వాటర్ గ్రిడ్ కు మూలమని ఆయన పేర్కొన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి