రాష్ట్ర విభజన నేపథ్యంలో క్రమంగా తగ్గుతున్న పన్ను వసూళ్లపై తెలంగాణ సర్కారు అంతర్మథనంలో కూరుకుపోయింది. మొన్నటికిమొన్న చమురు సంస్థలు సీమాంధ్రలో పన్నులు కడుతున్న వైనంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రభుత్వం, తాజాగా ఆన్ లైన్ లలో విక్రయాలు సాగిస్తున్న ఈ-టెయిలింగ్ సంస్థలపై దృష్టి సారించింది. తెలంగాణ పరిధిలో జరిపే విక్రయాలకు సంబంధించిన పన్నును తమకే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ విక్రయాలు పెరిగిన నేపథ్యంలో రిటెయిల్ విక్రయాలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం తెలంగాణ పరిధిలోని హైదరాబాద్ లో గణనీయంగా పెరుగుతోంది. రిటెయిల్ విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో వ్యాట్ పన్ను వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో తెలంగాణ పన్నుల రాబడి కూడా గణనీయంగా తగ్గింది. తగ్గుతున్న పన్ను రాబడులను రాబట్టేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టింది.
ఎక్కడో బెంగళూరు, ముంబై, ఢిల్లీలో కూర్చుని ఇక్కడి వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుని కొరియర్ సేవల ద్వారా వస్తువులను చేరవేస్తున్న ఈ-టెయిలింగ్ సంస్థలు పన్నులను మాత్రం అక్కడే కడుతున్నాయి. ఇకపై ఈ తరహా వ్యవహారం చెల్లదని చెబుతూ, తమ ప్రాంత పరిధిలో విక్రయమవుతున్న వస్తువులకు సంబంధించిన పన్నును తమకే చెల్లించాలని కేసీఆర్ సర్కారు వాదిస్తోంది. ఈ విషయంలో తన ఆదేశాలు పాటించని ఈ-టెయిలింగ్ సంస్థల కార్యకపాలను నిషేధించేందుకు వెనుకాడేది లేదని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి