ప్రపంచానికి శాంతి నేర్పించండి అంటూ మహాత్మాగాంధీ చెప్పినట్టు మన పిల్లలకు శాంతి గురించి నేర్పిద్దాం అని నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. నార్వేలోని ఓస్లోలో ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పిల్లలు దేవుడితో సమానమని, వారిలో తేడాలు చూడలేమని, పిల్లాడేడిస్తే అంతా ఒకేలా స్పందిస్తామని అలాంటప్పుడు మన పిల్లల కోసం మనం పోరాడలేమా? అని ఆయన స్పూర్తిని రగిలించారు.
బాల కార్మిక వ్యవస్థ, బాలల ట్రాఫికింగ్, బాలలకు అందని విద్య, బాలలపై అఘాయిత్యాలు, బాలలపై దాడులను రద్దు చేసేలా పోరాడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పిల్లకు స్వేచ్ఛ ఉండాలని ఆయన సూచించారు. నేటి నుంచి బాలల అంశంపై ప్రపంచం సొంత జెండాలు, అజెండాలు వదలాలని, అంతా కలిసి నడవాలని ఆయన ఆకాంక్షించారు.
వేల కొద్దీ మహాత్మా గాంధీలు, నెల్సన్ మండేలాలను తయారు చేసేందుకు బానిస సంకెళ్ల నుంచి, బాలకార్మిక వ్యవస్థ నుంచి బాలల హక్కుల హరించి వేత నుంచి వారికి స్వేచ్ఛ కల్పిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం ముగించిన చాలా సేపటి వరకు కరతాళ ధ్వనులు మార్మోగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా అంజాద్ అలీ ఖాన్ సరోద్ కచేరీ అద్భుత ఆదరణ పొందింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి