బుద్ధుడు, గురు గోవింద్ సింగ్, గాంధీల స్ఫూర్తితో నడుస్తున్నానని నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి తెలిపారు. నోబెల్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఓస్లోలో ఆయన మాట్లాడుతూ, మనం యుద్ధాల కోసం, దేశ భద్రతకోసం ఖర్చు పెడుతున్న దానిలో ఒక్క శాతం ఖర్చు చేస్తే, పరిపూర్ణమైన యువకులు తయారవుతారని అన్నారు. ప్రతి బాలుడు, బాలిక స్వేచ్ఛగా ఆడాలి, చదవాలి, పాడాలి, నిద్రపోవాలి అని ఆయన ఆకాంక్షించారు.
బాలలకు భవిష్యత్ పై భయం లేకుండా వారిని పెంచాలని ఆయన సూచించారు. మనం బాల కార్మికులను, బాల బాధితులను గణనీయంగా తగ్గించగలిగితే సమర్ధవంతమైన ప్రపంచాన్ని తయారు చేయగలమని ఆయన అన్నారు. బాలలకు విద్యను సమర్ధవంతంగా అందించాలని ఆయన సూచించారు. బాలల హక్కులపై ప్రపంచం మొత్తం ఒకతాటిపై నడవాలని ఆయన కోరారు. అమాయక బాలలకు తాను ప్రతినిధినని ఆయన పేర్కొన్నారు.
బాల్యాన్ని, బాలల కలలను ఛిద్రం చేసే అధికారం మనకు లేదని ఆయన స్పష్టం చేశారు. బాలల కోసం ప్రపంచం మొత్తం ఒకేలా ఆలోచించి, ఆచరించాలని ఆయన కోరారు. బాలల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ నోబెల్ పురస్కారం అంకితమని ఆయన తెలిపారు. నోబెల్ పురస్కారానికి ముందు సత్యార్థి భగవద్గీతలోని ఓ శ్లోకం చెప్పి ప్రసంగం ప్రారంభిచారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి