ప్రపంచంలో అత్యంత చిన్నదైన బైబిల్ ను నానో బైబిల్ కంపెనీ రూపొందించింది. ఈ బైబిల్ సైజు (4.76 మిమీ) సెంటీమీటర్ లో సగం కంటే తక్కువేనట. ఈ బైబిల్ ను జెరూసలెంలో ఉన్న నానో బైబిల్ కంపెనీవారు సిలికాన్ నానో చిప్ తో తయారు చేశారు. ఈ బైబిల్ లో గ్రీకు వెర్షన్ న్యూ టెస్ట్ మెంట్ (కొత్త నిబంధన) లోని 27 భాగాలను ముద్రించారు.
ఈ బైబిల్ లో ఒక్కో అక్షరం 0.18 మైక్రాన్లు అంటే ఒక మీటర్ లో 1.80 కోట్ల వంతు సూక్ష్మంగా ఉంటుందని రూపకర్తలు తెలిపారు. అందుకే ఈ బైబిల్ ను మైక్రోస్కోపు కింద పెట్టి చదువుకోవాల్సిందే. ఈ నానో బైబిల్ ను లాకెట్ లోనూ, గడియారంలోనూ, ఇతర ఆభరణాల్లో అమర్చుకోవచ్చని సదరు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి అత్యంత చిన్న బైబిల్ రికార్డు భారతీయుడి పేరిటే ఉంది. దీన్ని నానో బైబిల్ అధిగమించడం ఖాయమని అంటున్నారు.
ఈ నానో బైబిల్ ఇంకా చిన్నదని, దీనిని రికార్డు పుస్తకాల్లో నమోదు చేయిస్తే గిన్నిస్ రికార్డు ఖాయమని, దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత చిన్న పుస్తకం రికార్డు 'టినీ టెడ్ ఫ్రమ్ టర్నిప్ టౌన్' అనే 30 పేజీల కథల పుస్తకం పేరిటే భద్రంగా ఉంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి