దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గజం స్థలం కావాలంటే కోట్లు చెల్లించాల్సిందే. పగలు, రాత్రికి అన్న తేడా లేకుండా జన సమ్మర్ధం కొనసాగే ముంబైలో నివాసం ఉండడం ఉత్తరాదిలోని సగం మంది కల. ఉద్యోగం, సినిమాలు, ఆర్థికావకాశాలు అంటూ దేశంలోని సగం రాష్ట్రాల నుంచి ముంబైకి చేరే వలస పక్షుల సంఖ్య చాలా ఎక్కువ. దీంతో, అక్కడ రియల్ ఎస్టేట్ కు భలే గిరాకీ పలుకుతోంది. దీంతో ప్రముఖ రియాల్టీ సంస్థ లోథా గ్రూప్ తొమ్మిది రోజుల్లో 500 కోట్లు విలువ చేసే ప్లాట్లు అమ్మింది.
దక్షిణ మధ్య ముంబైలో 'వరల్డ్ వన్ టవర్' పేరిట 117 అంతస్తుల భవంతి నిర్మాణాన్ని లోథా గ్రూప్ 2010లో ప్రారంభించింది. ఇది 2016 నాటికి పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో, ఈ టవర్ లో ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించింది. దీనికి ముంబైకర్ల నుంచి అనూహ్యమైన ఆదరణ వచ్చిందని లోథా గ్రూప్ తెలిపింది. తాజాగా, బుకింగ్స్ ప్రారంభించగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని లోథా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోథా తెలిపారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే 500 కోట్ల రూపాయలు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్నారని ఆయన చెప్పారు.
'వరల్డ్ వన్ టవర్' లో 75 శాతం సివిల్ నిర్మాణం పూర్తైందని ఆయన వివరించారు. అయితే ఇక్కడ ఫ్లాట్ ఎంత? ఎంత మంది ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు? ఫ్లాట్ బుక్ చేసుకునేందుకు నిబంధనలు ఏంటి? అనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించకపోవడం విశేషం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి