భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని పరిశుభ్ర భారత్ గా మార్చే ఉద్దేశంతో చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు తమ చిత్తానికి నిర్వహించి అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో మూడు రోజుల పాటు 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశించింది. దీంతో, అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానంలో అధికారులు 'స్వచ్ఛ భారత్' ను చేపట్టారు.
దీనికి అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని ఆహ్వానించారు. పవిత్రమైన దేవుని సన్నిధానాన్ని యథా ప్రకారం ఆలయ సిబ్బంది ఉదయమే శుభ్రం చేశారు. ప్రజా ప్రతినిధులు తమకు అలవాటైన రీతిలో పంక్చువాలిటీ(!) పాటించి ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆలయం పరిశుభ్రంగా ఉండడంతో 'స్వచ్ఛ భారత్' ఎలా చేయాలన్న సందేహం వచ్చింది. వెంటనే బయటి నుంచి ఆకులు, చెత్త తెప్పించి క్షణాల్లో ఆలయం ఆవరణలో చెల్లాచెదురుగా విసిరేయించారు.
తరువాత, స్వేదం చిందేలా శుభ్రపరిచిన వారిలా ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చీపుర్లు పట్టుకుని 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్నట్టు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇలా ఉంటే దేశంలో 'స్వచ్ఛ భారత్' సాధ్యమేనా? అని స్థానికులు నవ్వుకున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి