పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన నేత ఒకరు టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ముష్టిఘాతాలతో విరుచుకుపడటమే కాక కాలికున్న బూటు తీసి మరీ కొట్టాడట. ఇంతకూ ఆయనగారు అంత ఆగ్రహంగా ఊగిపోవడానికి కారణమేమిటో తెలుసా..? టోల్ రుసుము చెల్లించమని అడగడమే!
వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ మైనారిటీ డెవలప్ మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అబూ ఆయేశ్ మొండల్ ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి బుర్ద్వాన్ బయలుదేరారు. హూగ్లీ జిల్లా దంకుని టోల్ ప్లాజా వద్ద ఆయన కారును నిలిపేసిన టోల్ గేట్ సిబ్బంది, టోల్ రుసుము చెల్లించాలని కోరారు. తాను ప్రభుత్వ ప్రతినిధినంటూ ఆయన చెప్పారు. ‘సరే, ఓ సారి ఐడెంటిటీ కార్డు చూపండి సార్’ అంటూ టోల్ గేట్ ఉద్యోగి ఒకరు ఆయనను అడిగారు.
అంతే, ఒక్కసారిగా కారు దిగిన మొండల్ అతడిపై ముష్టిఘాతాలు కురిపించారట. ఆయనను నిలువరించేందుకు అక్కడికొచ్చిన మిగతా సిబ్బందిపైనా ఆయన చేయి చేసుకున్నారు. అయినా కోపం తగ్గని మొండల్ కిందకు వంగి తన కాలికున్న బూటు తీసి, తనను ఐడీ కార్డు అడిగిన ఉద్యోగిని కొట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తనను ప్రశ్నించిన విలేకరుల వద్ద... వాగ్వాదం జరిగిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. అయితే, తానెవరినీ... దేనితోనూ కొట్టలేదని మొండల్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఆయనగారు గతంలోనూ టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారట.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి