అప్పుడే కోర్టులో హాజరుపరచి జైలు వద్దకు తీసుకొచ్చిన ఖైదీల నుంచి జార్ఖండ్ పోలీసులు ఊహించని విధంగా దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాడి నుంచి తేరుకున్న పోలీసులు కాల్పులకు దిగారు. మంగళవారం చైబాసా జైలు మెయిన్ గేటు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టు ఖైదీలు మరణించగా, 12 మంది ఖైదీలు పరారయ్యారు.
వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ లోని సింగ్ భం జిల్లా కోర్టులో హాజరుపరచిన 50 మంది మావోయిస్టు ఖైదీలను పోలీసులు చైబాసా జైలుకు తరలించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే జైలు ప్రధాన ద్వారం వద్దకు పోలీసుల వ్యాను చేరుకుంది. అయితే ప్రధాన ద్వారం పరిసరాల్లో జరుగుతున్న సంతను ఖైదీలు అవకాశంగా మలచుకున్నారు.
గేటు ముందు వ్యానులో నుంచి దిగిన ఖైదీలు ఒక్కసారిగా పోలీసుల కళ్లల్లో కారం చల్లారు. వెనువెంటనే అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. ఊహించని పరిణామంతో క్షణాల్లో తేరుకున్న పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టు ఖైదీలు చనిపోయారు. అయితే ఓ 12 మంది ఖైదీలు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి