కొత్త రాష్ట్రంలో పలు సంస్థలు, కార్యాలయాలు మొదలైన వాటిని నెలకొల్పేందుకు గుంటూరుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా నవ్యాంధ్రలో క్రీడా కార్యకలాపాలకు కేంద్రంగా గుంటూరు దాదాపు ఖరారైంది. ఈ జిల్లాలోనే క్రీడా సంస్థలు నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత చూపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎన్)ను నెలకొల్పేందుకు రాజీవ్ గాంధీ ఖేల్ యోజన (ఆర్ జీకేఏ) కార్యాలయం ముందుకు వచ్చింది.
రాజధాని ప్రాంతంలో ఎన్ఐఎన్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతో శాప్ ఎండీ చక్రవర్తి గుంటూరుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భూముల కోసం అన్వేషించాలని జిల్లా డీఎన్ డీవోను ఆదేశించారు. వీటన్నింటితో పాటు గురజాలలో క్రీడా విశ్వవిద్యాలయం నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇందుకోసం స్థలాన్ని కూడా ఇప్పటికే గుర్తించారు. అటు శాప్ కార్యాలయాన్ని గుంటూరులోని బీఆర్ స్టేడియానికి వీలున్నంత తొందరలో తరలించాలని చూస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి