హైదరాబాద్ శివారులో గుట్టుగా సాగుతున్న ఓ రేవ్ పార్టీని నగర పోలీసులు సోమవారం రాత్రి భగ్నం చేశారు. పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్ పై దాడి చేసిన పోలీసులు రేవ్ పార్టీలో మునిగిపోయిన దాదాపు 30 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎనిమిది మంది ముంబైకి చెందిన యువతులతో పాటు 22 మంది యువకులున్నారు. వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం.
సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు ఈ రేవ్ పార్టీపై దాడి చేశారు. పార్టీలో భాగంగా యువతులు ముజ్రా డ్యాన్స్ ల పేరిట అశ్లీల నృత్యాలతో అలరిస్తున్నారు. దాడి సందర్భంగా మద్యం బాటిళ్లతో పాటు ఖరీదైన మొబైల్ ఫోన్లు, రూ.1.20 లక్షల నగదు, విలువైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి