భారత ప్రధాని నరేంద్ర మోదీ... టైమ్స్ రీడర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు టైమ్ మేగజీన్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఏటా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిని ఎంపిక చేస్తున్న టైమ్ మేగజీన్, ఇందుకోసం సుదీర్ఘంగా ఆన్ లైన్ పోలింగ్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఈ పోలింగ్ ఆదివారం ముగియగా, ఫలితాలను సోమవారం ప్రకటించిన సదరు మేగజీన్, ప్రపంచ పాఠకుల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా మోదీని ప్రకటించింది.
ఆన్ లైన్ లో పోలైన మొత్తం ఓట్లలో మోదీ ఒక్కరే 16 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. అయితే టైమ్ మేగజీన్ ప్రపంచ నేతల తుది జాబితాలో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. టైమ్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ తుది పోటీలో నిలిచిన ఎనిమిది మంది జాబితా నేడు విడుదల చేసింది. ఈ జాబితాలో చైనా ఈ-టెయిలింగ్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, ఎబోలా వైద్యులు, రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫెర్గ్యూసర్ ఆందోళనకారులు, గాయకుడు టేలర్ స్విఫ్ట్, నేషనల్ ఫుట్ బాల్ లీగ్ కమిషనర్ రోజర్ స్టోకోయి గూడెల్, కుర్దూ రాజకీయవేత్త మసౌద్ బర్జానీలు ఉన్నారు. వీరి నుంచి మేగజీన్ 'పర్శన్ ఆఫ్ ద ఇయర్'ను ఎడిటర్ల బృందం ఎంపిక చేసి ఈ నెల 10న ప్రకటిస్తుంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్