జమ్మూలోని సాంబాలో ప్రధాని మోదీ ఎన్నికల సభ కొనసాగుతోంది. మోదీ సభకు జనం పోటెత్తారు. కొంత మంది చెట్లు ఎక్కి ప్రసంగం వింటున్నారు. వీరిని ఉద్దేశించి మాట్లాడుతూ, "చెట్ల మీదున్న వారు జాగ్రత్త. మీరు కింద పడితే ఆ వార్త మీడియాలో వస్తుంది. నన్ను నిందిస్తారు" అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికల సభలకు ఇంతమంది రావడం, ప్రసంగాలకు స్పందించడాన్ని నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని... లేకపోతే, మన సైనికుల మాదిరి మీరు కూడా ఉగ్రవాదుల దాడులకు గురయ్యే ప్రమాదం ఉందనీ అన్నారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని చెప్పారు.
బీజేపీకి పట్టం కట్టాలని... హంగ్ అసెంబ్లీ రాకుండా చూడాలని ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు. మీ ఓటు విలువను అభివృద్ధి అనే వడ్డీ సహా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, వ్యవసాయ భూములకు సాగు నీరు, ఆహారం అందించే బాధ్యత తనదని చెప్పారు. బుల్లెట్ కి బ్యాలెట్ తో సమాధానం చెప్పాలని అన్నారు. ఏకే47 ట్రిగ్రర్ నొక్కితే చావుకు కారణమవుతుందని... కానీ, ఈవీఎం మీద బటన్ నొక్కితే రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి