ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య స్పర్థ తీవ్రస్థాయిలో రాజుకుంది. మరోసారి తామే ఢిల్లీ పీఠం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, మోదీ ప్రభంజనంతో హస్తినను ఊడ్చిపారేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో పార్టీలు వాతావరణాన్ని వేడిక్కిస్తున్నాయి. తాజాగా, ఓ టీవీ చానల్ ఈ రెండు పార్టీల కార్యకర్తలతో ఓ బహిరంగ చర్చ నిర్వహించింది. అయితే, చర్చను మధ్యలోనే వదిలేసి ఇరువర్గాలు ముష్టియుద్ధానికి దిగాయి. తొలుత, బీజేపీ కార్యకర్త ఆమ్ ఆద్మీ మద్దతుదారుడిని కొట్టడంతో ఘర్షణ మొదలైంది. కాసేపటికి ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. బీజేపీ నేత మోహన్ సింగ్ బిస్త్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కపిల్ మిశ్రాను బెదిరించారు.
గాయపడిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కరవాల్ నగర్ పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ ప్రతినిధి దుర్గేశ్ పాఠక్ మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన వారెవరూ దాడి చేయలేదని, బీజేపీనే దుందుడుకుగా వ్యవహరించిందని చెప్పారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్