ప్రజాప్రతినిధులుగా పనిచేసిన కొందరు కోట్లకు పడగలెత్తి దర్జాగా బతుకుతుంటే, మరికొందరు దయనీయ స్థితిలో మనుగడ సాగిస్తున్నారు. వివరాల్లోకెళితే... వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండకు చెందిన రంగయ్య 2006లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో గ్రామ ఎంపీటీసీగా టీడీపీ తరపున గెలిచాడు. ఎంపీపీ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో రంగయ్య ఎంపీపీ అయ్యాడు. ఏడేళ్లపాటు నిస్వార్థంగా సేవలందించాడు. పదవి చేపట్టకముందు కూలీనాలీ చేసుకునేవాడు. ఎంపీపీ అయిన తర్వాత ప్రజల సేవ కోసమే పూర్తి సమయం కేటాయించాడు. గౌరవ వేతనమే అతని కుటుంబానికి అక్కరకొచ్చేది.
స్వార్థ రహితంగా పనిచేసిన ఈ వ్యక్తి ఇప్పుడు ఓ సాధారణ సెక్యూరిటీ గార్డుగా బతుకీడుస్తుండడం బాధాకరం. ఎంపీపీ పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రంగయ్య ఉపాధి కోసం ఊరు విడిచాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారికి కూడా ప్రభుత్వం నెలసరి వేతనం ఇచ్చి ఆదుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో!
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి