హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ దేశంలోనే పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగారని వైకాపా నేత కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం సినిమాలు, రాజకీయాల చుట్టూ తిరిగితే జానకీరామ్ మాత్రం పారిశ్రామిక రంగం వైపు అడుగులేశారని ఆయన చెప్పారు. శనివారం నాటి రోడ్డు ప్రమాదంలో జానకీరామ్ మృత్యువాత నేపథ్యంలో ఆదివారం హరికృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు కొడాలి నాని మాసాబ్ ట్యాంక్ లోని వారి నివాసానికి వచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాని జానకీరామ్ తో తన పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్నా, జానకీరామ్ ఏనాడు ఆర్భాటాలకు పోలేదని ఆయన అన్నారు. అంతేకాక వంశపారంపర్యంగా అందివచ్చిన ఆస్తులపై ఆధారపడని జానకీరామ్ అమెరికాలో పదేళ్ల పాటు పనిచేసి బాగానే డబ్బు ఆర్జించారని చెప్పారు. ఆ డబ్బుతోనే కాకినాడలో కోవలెంట్ పరిశ్రమను నెలకొల్పుతున్నారన్నారు. మరో నెల రోజుల్లో సదరు కంపెనీ ప్రారంభం కానున్న నేపథ్యంలో జానకీరామ్ అస్తమయం తనను కలచివేసిందన్నారు. మరింతకాలం బతికి ఉంటే జానకీరామ్ విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగేవారని ఆయన చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి