తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డు సభ్యుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ భార్య, మహిళా వ్యాపారవేత్త అయిన నీతా అంబానీని కూడా కార్యనిర్వాహక బోర్డులో సభ్యురాలిగా నియమించినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో బోర్డును అధికారికంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బోర్డులో సభ్యత్వం కోసం ప్రభుత్వానికి 1,200 దరఖాస్తులు వచ్చాయి. వాటి నుంచి సభ్యులను ఎంచుకున్నారని తెలిసింది. అయితే, నీతా కాకుండా సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో, బీజేపీ నేత శివాజీ, ఏపీ బీజేపీ అధికారప్రతినిధి జీ.భాను ప్రకాష్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి.
వీరందరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురి పేర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి సదానంద గౌడ, పార్టీ అగ్రనేతలు బోర్డుకు సిఫారసు చేశారు. వారందరిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందట. సాధారణంగా టీటీడీ బోర్డులో ఛైర్మన్ తో కలిపి 15 మంది సభ్యులే ఉంటారు. కానీ, ఈసారి తెలుగు మాట్లాడే కొత్త రాష్ట్రం తెలంగాణను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు, మొత్తం 18 మంది సభ్యులను తీసుకోవాలని తలంచారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి