భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాల కోసం ఏకంగా రామదండే వరి చేలో దిగి కోతమొదలు పెట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో చోటుచేసుకుంది. ఏటా భద్రాద్రి రాముని కల్యాణోత్సవానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించడం శ్రీకృష్ణచైతన్య సంఘం ప్రెసిడెంట్ కళ్యాణం అప్పారావుకు ఆనవాయతీ. ఇందుకు అవసరమైన ధాన్యాన్ని తానే పండిస్తే బాగుంటుందన్న ఆలోచనతో కోరుకొండ-గోకవరం మధ్య కొంత పొలంలో వరి సాగుచేశారు.
కొతకు వచ్చిన పంటలోంచి కొన్ని కంకులను కోసి అటుగా వచ్చిన శ్రీవారి రథయాత్రకు కానుకగా అందజేశారు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీలకు హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వంటి వేషాలు వేయించి, శ్రీరామ నామాన్ని జపిస్తూ పైరును కోయించారు. అనంతరం ఆ వేషధారులు పనలను బల్లకేసి కొట్టి, నూర్పిడి పూర్తి చేశారు. ఎప్పట్లాగే కోరుకొండ, రాజానగరం మండలాల్లోని శ్రీరామ భక్తులకు ధాన్యం అందజేసి, గోటితో ఒలిపించి, లెక్కించి కోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్యకు సమర్పిస్తామని ఆయన చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి