నిర్వహణ ఖర్చులు అధికమవడంతో పాటు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల నూతన సంవత్సరం ఆరంభం నుంచి తామందిస్తున్న డిస్కవరీ, ప్లాటినా మోడల్ బైకుల ధరలను పెంచనున్నట్టు బజాజ్ ఆటో ప్రకటించింది. ఎంతమేరకు పెంచాలన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థ మోటార్ సైకిల్ విభాగం అధ్యక్షుడు ఎరిక్ వ్యాస్ వివరించారు. ఇటీవలి దసరా దీపావళి సీజన్లో పల్సర్ మోడల్ ధరను రూ.1,000 వరకు పెంచిన విషయం తెలిసిందే.