యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో, భారత్ తమకెంతగానో సహకరించిందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. షెడ్యూల్ మార్పు అంశంలో పర్యాటక జట్టు అందించిన తోడ్పాటు తమకు ఇబ్బందులు తగ్గించిందని క్రికెట్ ఆస్ట్రేలియా డైరెక్టర్ మైకేల్ కాస్ప్రోవిజ్ తెలిపారు. షెడ్యూల్ మార్చుతున్నట్టు చెప్పగానే, టీమిండియా మేనేజ్ మెంట్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా అంగీకరించిందని అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు వారికి థాంక్స్ చెబుతున్నామని పేర్కొన్నారు. హ్యూస్ అంత్యక్రియలకు రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, డంకన్ ఫ్లెచర్ వచ్చారని, ఆ సందర్భంగా తాను శాస్త్రితో మాట్లాడానని కాస్ప్రోవిజ్ వివరించారు. శాస్త్రి టెస్టు సిరీస్ తేదీల మార్పుకు వెంటనే సమ్మతి తెలిపాడని చెప్పారు.
ఇక, ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా తొలి టెస్టును ఆడడం ద్వారా 'హ్యూస్ పేజీ'ని తిప్పేస్తారని భావిస్తున్నామని అన్నారు. హ్యూస్ మరణం అంతర్జాతీయంగా ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. తొలి టెస్టు ఆడడమే హ్యూస్ కు సరైన నివాళి అన్న కోచ్ డారెన్ లేమన్ తో తాను ఏకీభవిస్తున్నానని కాస్ప్రోవిజ్ పేర్కొన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి