ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు పొందాలంటే ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోవాలని భావిస్తూ, అడ్మిషన్ అధికారులుగా అందమైన భామలను, బార్ డాన్సర్లనూ ఏరికోరి నియమించిందో అమెరికా కాలేజ్. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి, ముందుగా తర్ఫీదు ఇచ్చిన విద్యార్థులతో అబద్ధాలు చెప్పించి మిలియన్ ల కొద్దీ ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా తీసుకుంది. ఫ్లోరిడాలోని ఫాస్ట్ ట్రైన్ కాలేజి చేస్తున్న ఈ నిర్వాకాన్ని గుర్తించిన అధికారులు మియామీ కోర్టులో కేసు వేశారు.
అందంగా ఉన్న యువతులను నియమించి, వారు రెచ్చగొట్టేలా వుండే దుస్తులను ధరించేలా చూసి కాలేజిలో
ప్రవేశాలకు వచ్చే విద్యార్థులు మరో వైపు చూడకుండా చేయాలన్నది ఫాస్ట్ ట్రైన్ కాలేజి యాజమాన్యం భావన.
నిబంధనల మేరకు ఓ విద్యార్థి కనీసం 30 రోజుల పాటు కాలేజికి హాజరైతేనే, ప్రభుత్వ నిధులు వస్తాయి. విద్యార్థులను కాలేజికి రప్పించేందుకు ఇలా నానా పాట్లూ పడ్డ ఫాస్ట్ ట్రైన్ కాలేజి చివరకు దొంగ విద్యార్థులను కూడా చూపిందట. అభియోగాలను నమోదు చేసిన కోర్టు అటు సివిల్, ఇటు క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రారంభించింది. ఈ తరహాలో లాభాల కోసం కష్టపడుతున్న కాలేజీలు ఫ్లోరిడా ప్రాంతంలో ఇంకా చాలానే ఉన్నాయట!
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి