‘‘అసలే ఏడాది వ్యవధిలో రెండోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. చచ్చీచెడీ తొలిసారి ఎన్నికలకు అవసరమైన నిధులను ఎలాగోలా రాబట్టాం. స్వయంకృతాపరాధంతో వచ్చిన అవకాశాన్ని దిగజార్చుకుని రెండోసారి ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోంది. నిధుల సమీకరణ సత్ఫలితాలివ్వడం లేదు. విదేశాలకైనా వెళ్లొద్దాం’’ అని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఇంటా, బయటా ఎదురీత తప్పడం లేదు. మొన్నటిదాకా కేజ్రీవాల్ ముఖ్య అనుచరుడిగా కొనసాగి ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినోద్ కుమార్ బిన్నీ తాజాగా కేజ్రీవాల్ వైఖరిపై ఆరోపణలు గుప్పించారు.
నిధుల సమీకరణకు పార్టీ చేపట్టిన విందు రాజకీయాలు ఫలించలేదు, మరి నగరంలో వెలసిన హోర్డింగులకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ఆయన కేజ్రీవాల్ ను నిలదీశారు. అంతేకాక నిధుల కోసం విదేశీయానానికి సిద్ధపడ్డ కేజ్రీవాల్ నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘ఢిల్లీలోని ప్రతి వీధిలో ఆప్ హోర్డింగ్ లు కనిపిస్తున్నాయి. ఒక్కో హోర్డింగుకు ఎంతలేదన్నా రూ. లక్ష నుంచి 1.5 లక్షల దాకా ఖర్చవుతోంది. మరి ఆ నిధులన్నీ ఏ మార్గాల్లో వస్తున్నాయి?’’ అంటూ బిన్నీ సంధించిన ప్రశ్నలకు కేజ్రీవాల్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి