తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడిగా భేటీ కానున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ఇద్దరు తెలుగు సీఎంలు ఢిల్లీ వెళుతున్నారు. ఈ క్రమంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండుతో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధానిని కలిసేందుకు యత్నిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రుల సదస్సుకు చంద్రబాబు కూడా వస్తున్న నేపథ్యంలో ఇద్దరితో ఉమ్మడిగా భేటీ నిర్వహిస్తే, భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపవన్న భావన కేంద్రంలో వ్యక్తమవుతోంది.
ప్రతి విషయంలోను రెండు రాష్ట్రాలూ కత్తులు దూసుకుంటున్న నేపథ్యంలో ఈ తరహా భేటీ సత్ఫలితాలనిస్తుందని కూడా కేంద్రం భావిస్తోంది. ఇప్పటిదాకా ఇలాంటి భేటీకి సంబంధించి స్పష్టత లేకున్నా, ఇద్దరు సీఎంలతో ఉమ్మడి భేటీకి ప్రధాని మోదీ ఆసక్తి కనబరుస్తున్నారని ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడం ఖాయమేనన్న మాట.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి