తెలుగమ్మాయి ప్రశాంతిరెడ్డిని బ్రిటీష్ ఎంపీ డాన్ బైల్స్ పెళ్లాడడం తెలిసిందే. మనసులు కలిసిన అనంతరం, కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుని, క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. 2007 జూన్ 22న బైల్స్, ప్రశాంతి వివాహం జరిగింది. బైల్స్ బ్రిటీష్ జాతీయుడు కాగా, ప్రశాంతి స్వస్థలం వరంగల్. వీరికి ఇద్దరు పిల్లలు. కన్జర్వేటివ్ పార్టీ తరపున 2010లో ఎంపీగా ఎన్నికయ్యాడు బైల్స్. ఇతడికి తెలుగు సంప్రదాయాలంటే అమిత గౌరవం. అంతా భార్య మహత్మ్యం కావచ్చు. కాగా, బైల్స్ కొన్నిరోజుల క్రితం అత్తారిల్లైన వరంగల్ వచ్చాడు.
భార్య ప్రశాంతితో కలిసి చారిత్రక స్థలాలను దర్శిస్తూ మీడియాకు చిక్కాడు. స్థానిక దేవాలయాల్లో పూజాదికాల సందర్భంగా, ఆచార వ్యవహారాలను ఆసక్తిగా పరికించాడీ బ్రిటిషర్. అంతేగాదు, శ్రద్ధగా పాటించాడు కూడా. తనకు తెలుగు సంస్కృతి అంటే ఇష్టమని ఈ సందర్భంగా తెలిపాడు. పనిలోపనిగా, కేసీఆర్ పాలన భేష్ అంటూ ఓ ఉచిత సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు. అన్నట్టు... ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి రచించిన 'ప్యాసా' అనే పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులో విడుదలైంది. ఓ తెలుగువాడు రాసిన పుస్తకం ఖండాంతరాలు దాటి విడుదల కావడానికి తెలుగువారి అల్లుడు డాన్ బైల్సే కారణం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి