అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ నెల 22న న్యూయార్క్ లో 12 ఏళ్ల తమీర్ రైస్ అనే బాలుడు ఓ గ్రౌండ్ బయట బొమ్మ తుపాకీతో ఆడుకుంటూ, సరదాగా గ్రౌండ్ లోని వారికి గురిపెట్టాడు. దానిని నిజమనుకుని ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారమందించాడు. దీంతో, రంగ ప్రవేశం చేసిన పోలీసులు, అది నిజం తుపాకీయా? కాదా? అని తేల్చుకోకుండానే చేతులు పైకెత్తమని బాలుడిని హెచ్చరించారు.
తన చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీ కదా అని అతను నిర్లక్ష్యం చేయడంతో బాలుడిపై కాల్పులు జరిపారు. దీంతో తమీర్ విలవిల్లాడుతూ నేల కూలాడు. మరుసటి రోజు మృతి చెందాడు. దీనిపై నల్లజాతీయులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతలో ఆగస్టు 9న మైఖేల్ బ్రౌన్ అనే 18 ఏళ్ల నల్లజాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గ్యూసన్ పోలీస్ అధికారి డారెన్ విల్సన్ తప్పులేదని అమెరికన్ గ్రాండ్ జ్యూరీ నేడు తేల్చింది. దీంతో నిరసనలు పెల్లుబికాయి.
లాస్ ఏంజిలెస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, ఓక్ లాండ్, డెల్ వుడ్, కాలిఫోర్నియాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వీధుల్లోకి వచ్చి పలు భవనాలకు నిప్పుపెట్టారు. పోలీస్ వాహనాలను ధ్వసం చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి