ఇటీవలే ఓ మహిళ న్యూయార్క్ వీధుల్లో ఒంటరిగా గంటల పాటు తిరగ్గా, మగాళ్ల నైజం వెల్లడైంది. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రవర్తించారు తమ వెకిలితనాన్ని చాటుకుంటూ. అదే తరహాలో ముంబైలో ప్రయోగాత్మకంగా ఓ మహిళ ఒంటరిగా తిరగ్గా ఒక్క మగాడు కూడా కామెంట్ చేయలేదు. ఇప్పుడా తరహాలోనే ఢిల్లీలోనూ ఓ మహిళతో ఈ తరహా పర్యటన చేయించింది ఇండీ ట్యూబ్ సంస్థ. హాఫ్ ప్యాంట్స్, సింపుల్ బ్లాక్ టాప్, కళ్లకు క్రోమ్ హార్ట్స్ గాగుల్ తో కాస్త ఆకర్షణీయంగానే ఉన్న ఆ అతివ మొత్తం 10 గంటల పాటు ఢిల్లీ వీధుల్లో ఒక్కతే తిరిగింది. ఆమెకు ముందు సంస్థ ప్రతినిధి బ్యాక్ ప్యాక్ లో కెమెరాతో నడుస్తూ, ఘటనలను చిత్రీకరించాడు. తొలుత కన్నాట్ ప్లేస్ వద్ద ఓ మధ్యవయస్కుడు కుటుంబంతో వెళుతూ కూడా, వెనుదిరిగి మరీ చూడడం వీడియోలో కనిపించింది. ఎర్రకోట ప్రాంతంలో ఓ యువకుడు తన ఫ్రెండ్స్ తో ఏదో చెప్పి, అనంతరం ఆమెను ఫాలో అయ్యాడు. అతగాడు "విదేశీ యువతివా?" అని అడిగాడు.
మరో ప్రాంతంలో ఓ యువకుడు ఆమెను చాలాసేపు వెంబడించాడు. ఇంకొకడు ఎలాంటి జంకు లేకుండా నేరుగా 'అప్రోచ్' అయ్యాడు. ఇక, పాలికా బజార్, సదరన్ ఎక్స్ టెన్షన్ వద్ద ఓ యువకుడు ఆమెతో మాట్లాడేందుకు తీవ్రంగా యత్నించడం వీడియోలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో, ముంబయిలోనే మహిళలకు భద్రత అధికమన్న విషయం స్పష్టమైంది. ఢిల్లీ... మహిళల పాలిట ఎంత భయానక ప్రాంతమో కూడా తేటతెల్లమైంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి