తమ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఏడు రోజుల్లోగానే అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా ఈ మేరకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వారంలోగా అన్ని అనుమతులు రానిపక్షంలో ఎనిమిదో రోజు తమ పెట్టుబడులతో సదరు పారిశ్రామికవేత్తలు వెనక్కెళ్లొచ్చని ఆయన ప్రకటించారు.
సోమవారం అక్కడి ఎన్ఐడీఈసీ, ఎన్మార్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ‘భారత్ లో పేరుకుపోయిన అలసత్వం కారణంగా వాణిజ్యం నెరపడం కష్టం కాదా?’అని ఎన్ఐడీఈసీ అద్యక్షుడు షిహెనొబు నాగమోరి సందేహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు ఘాటుగా స్పందించారు. 'ఏడు రోజుల్లోగా అనుమతులు ఇవ్వకపోతే ఎనిమిదో రోజు మీరు వెనక్కెళ్లొచ్చు' అంటూ నాగమోరికి ఆయన సమాధానమిచ్చారు. భారత్ లో పరిస్థితులు మారాయని, ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులతో ముందుకొచ్చే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకనున్నామని ఆయన తెలిపారు. అంతేకాక ఏపీలో వ్యాపారానికి అపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి