గుంటూరు జిల్లా మాచవరంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భూకంపం వస్తోందని భయపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల ఇళ్ల నుంచి సామాన్లు పడిపోయాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, గుంటూరు జిల్లా పరిధిలో గత మూడు నెలల్లో భూమి కంపించడం ఇది నాలుగోసారి. విజయవాడ, గుంటూరు జిల్లాలు నదీపరీవాహక ప్రాంతాలు కావడంతో భూమి పొరల్లో కదలికలు జరిగి, తద్వారా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.