'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో సెలబ్రిటీలంతా పాల్గొంటున్నారు. కానీ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా (పీసీ) ముంబైలోని వెర్సోవాలో అగ్నిపథ్ షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రాంతాన్ని, అక్కడి పరిసరాలను గమనించారు. దుర్గంధం నిండిపోయిన పరిసరాల్లో చెత్తా చెదారాల్లో చిన్నపిల్లలు ఆడడం చూసిన ప్రియాంక కలత చెందినా మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ప్రదాని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆమెను నామినేట్ చేశారు. దీంతో ఏం చేసినా పూర్తిస్థాయిలో చేయాలని పీసీ నిర్ణయించుకుంది.
ఎంపిక చేసుకున్న సన్నిహితులతో కలసి వెర్సోవాలోని ఓ ప్రాంతాన్ని ఎంచుకుంది. అక్కడికి రాత్రుళ్లు వెళ్లి శుభ్రం చేసింది. ఆ ప్రాంతంలోని చెత్తను డోజర్, ట్రక్కులతో శుభ్రం చేయించింది. రోలర్ తో ఆ ప్రాంతాన్ని చదును చేయించి చుట్టుపక్కల ఉండే గుడిసెలకు రంగులు వేయించింది. దీంతో అది చక్కని మైదానంగా మారిపోయింది. దానికి అన్ని వైపులా మొక్కలు నాటింది. అంతటితో తన పనైపోయిందని భావించకుండా స్థానికులను పిలిచి, 'నేను చేయగలిగింది చేశాను. ఇకపై బాధ్యత అంతా మీదే'నని చెప్పింది.
నెల రోజుల తరువాత చూస్తానని, పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చూడాలని పిల్లల నుంచి పెద్దవారి వరకు అర్థమయ్యేలా చెప్పింది. అలాగే మరో తొమ్మిది మందిని 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి నామినేట్ చేసింది. ఆమె నామినేట్ చేసిన వారిలో ముంబైలోని టాక్సీ, ఆటోరిక్షా యూనియన్లు ఉండడం విశేషం. వీరు పూనుకుంటే ముంబై ఒక్కరోజులో తళతళలాడడం ఖాయం. అందుకే మోదీ పీసీని ప్రత్యేకంగా అభినందించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి