తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఛానల్ ప్రసారాల నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఎంఎస్ వోలను ఆదేశించింది. గతవారం కూడా ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా ఎంఎస్ వోలు, ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో, ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదో పేర్కొంటూ, ప్రసారాలు నిలిపివేయడానికి గల కారణాలను పొందుపరచాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణలో ఆరు నెలలుగా ఏబీఎన్ ప్రసారాలు ఆపివేశారంటూ మురళీ అనే వ్యక్తి ఆ పిల్ ను దాఖలు చేశారు.
ఇదిలాఉంటే ఇదే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రెండింటితో పాటు 15 మంది ఎంఎస్ వోలు, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ సీపీ, ఎంఎస్ వో అసోసియేషన్ కు కూడా నోటీసులు ఇచ్చింది. వాటిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేసి ఎంఎస్ వోలు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనంటూ ఏబీఎన్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీం పైవిధంగా స్పందించింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి