అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ప్రచార పర్వం జోరందుకుంది. అధికంగా ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, పాకిస్థాన్ లో కంటే భారత్ లోనే ముస్లింలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ లో ప్రతి పౌరుడు, ప్రాంతాలకు అతీతంగా, రాజ్యాంగం అందించే హక్కులు కలిగి ఉంటాడని వివరించారు. బీజేపీ అభ్యర్థుల తరపున ఆయన సరిహద్దు ప్రాంతాలైన సురాన్ కోట్, పూంచ్, మెంధర్ లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలిగే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని షానవాజ్ హుస్సేన్ ఉద్ఘాటించారు. స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఉపాధి, విద్య, భద్రత, రోడ్ల అనుసంధానం, సురక్షితమైన తాగునీరు, అవినీతితో పాటు వారసత్వ పాలనను అంతమొందించడంపై బీజేపీ దృష్టి పెడుతుందని హుస్సేన్ వివరించారు. బీజేపీకి ఓటేస్తే జమ్మూ కాశ్మీర్ ను మునుపెన్నడూ లేని విధంగా పురోగామి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి