అవశేషాంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న తపనతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా మంత్రుల పని తీరుపై ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో, ముగ్గురు మంత్రుల శాఖలను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ బాబులు చంద్రబాబు లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి ముగ్గురికీ త్వరలోనే స్థాన చలనం తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రత్తిపాటి పుల్లారావు తన శాఖకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా పొందలేకపోతున్నారనే భావనలో చంద్రబాబు ఉన్నారు. హోంమంత్రి చినరాజప్ప విషయానికి వస్తే... ఆయన ఇంతవరకు తన శాఖపై పట్టు సాధించలేకపోయారని, సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారని సమాచారం. కాగా, బీజేపీతో టీడీపీ సంబంధాల విషయంలో కొద్ది రోజుల క్రితం కిషోర్ బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడమే కాక, రాజకీయంగా పెద్ద చర్చను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో, వీరి శాఖలలో మార్పులు తథ్యమని తెలుస్తోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి