టీమిండియా ఆసీస్ పర్యటన మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అప్పుడే మాటల వేడి మొదలైంది. భారత్ కు ఈ పర్యటన మరో చేదు అనుభవం కానుందని ఆసీస్ మాజీలు అంటుండగా, ఇక్కడ గెలవలేకపోవడానికి ప్రస్తుతం కారణాలేమీ కనిపించడంలేదని టీమిండియా తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అడిలైడ్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆసీస్ పర్యటన, పరిస్థితులకు అలవాటు పడడం కంటే ఆలోచనా విధానానికి సంబంధించిన విషయం అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ మెరుగ్గా రాణిస్తున్నాడని, అయితే, అతన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధనసంపత్తి తమ వద్ద ఉందని చెప్పుకొచ్చాడు. రెగ్యులర్ కెప్టెన్ ధోనీకి గాయం నేపథ్యంలో, కోహ్లీకి తొలి టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 4 నుంచి 8 వరకు జరగనుంది. టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా... ఆసీస్, ఇంగ్లండ్ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతుంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి