అమెరికాలో గత వారం రోజులుగా కురుస్తున్న మంచు ధాటికి న్యూయార్క్ సహా పలు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. న్యూయార్క్ లో మంచుతుపాను కొనసాగుతుండగా, బఫెల్లో నగరంలో గత రెండు రోజుల్లో సుమారు 6 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మంచుతుపాను ప్రభావం కొనసాగుతుండడంతో మరో మూడు అడుగుల మంచు పేరుకునే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచు భారీ స్థాయిలో కురుస్తుండడంతో పేరుకున్న మంచు ధాటికి కొన్ని ఇళ్ల పై కప్పులు బీటలు వారుతున్నాయి.
దీంతో ఇళ్లు కూలిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బఫెల్లో నగరానికి వెళ్లే రహదారులన్నీ మంచుతో కప్పుకుపోవడంతో దారులు మూసుకుపోయాయి. మంచు తీవ్రతకు న్యూయార్క్ స్టేట్ లో 10 మంది మృతిచెందారు. ఈ స్థాయిలో మంచు కురవడం తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఐదు వేల మంది నేషనల్ గార్డ్స్, అధికారులు మంచు తొలగించే చర్యల్లో పాల్గొంటున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి