బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో సీక్వెల్ కి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 'దబాంగ్' సినిమాకి తప్ప మరో సినిమాకి సీక్వెల్ రూపొందించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కానీ సల్లూ భాయ్ 'కిక్'కి సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. తెలుగులో సూపర్ హిట్టైన 'కిక్'ను సాజిద్ నడియాడ్ వాలా నిర్మాణ, దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రానికి సల్మాన్ స్టార్ స్టామినా మరింత 'కిక్'నిచ్చి, బాక్సాఫీసును షేక్ చేసింది.
దీంతో సల్మాన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్ తీయించేందుకు సల్మాన్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, సాజిద్ పలు సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాడు. కానీ, సల్లూభాయ్ చెబితే సినిమా తీయకుండా ఉంటాడా? అయితే కొత్తగా కథ, డైలాగులు రాయాలి. అది కాస్త కష్టమైనదే. దీనికి ఎంత సమయం పడుతుందో...'కిక్' సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి!
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి