భారత్ క్రికెటర్లు భోజన ప్రియులన్న సంగతి తెలిసిందే. ఎక్కడికెళ్లినా అక్కడి వంటకాలను ఓ పట్టు పట్టందే వదలరు. కాంటినెంటల్ ఫుడ్ అంటే క్యూ కడతారు. ఇప్పుడు ఆసీస్ పర్యటన సందర్భంగా వారికి ఎంత కష్టం వచ్చిపడిందో చూడండి. మధ్యాహ్న భోజనాన్ని కేవలం బటర్ చికెన్, రైస్ తోనే సరిపెట్టుకోవాలట. కారణం, ఫిట్ నెస్ దెబ్బతింటుందన్న భయమే! స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టీమిండియా, వెంట ఓ చెఫ్ ను కూడా తీసుకెళుతోంది. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు మెనూలో ఉండాల్సిన వంటకాల వివరాలను పంపారు మనవాళ్లు. అందులో ఎర్రని పెద్ద అక్షరాలో 'నో స్పైసీ ఫుడ్' అని రాశారు.
ప్రస్తుత జట్టులో అత్యధికులు వెజిటేరియన్లు కావడంతో వారికి ప్రత్యేక ఆహారం అందిస్తారట. ఇక, బీఫ్ (పశుమాంసం), పోర్క్ (పందిమాంసం)కు నో చెప్పేశారు. బ్రేక్ ఫాస్ట్ లో గ్రిల్డ్ మష్రూమ్స్, బేక్డ్ బీన్స్, యోగర్ట్, తాజా ఫలాలు తీసుకుంటారు. లంచ్ విషయానికొస్తే బటర్ చికెన్, స్టీమ్డ్ రైస్, చేపలు, డ్రై వెజిటబుల్ కర్రీ మెనూలో చేర్చారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి