బీజేపీకి ఓటేసి అధికారమిస్తే, ఇస్లాం మరింత వృద్ధి సాధిస్తుందని ఆ పార్టీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు రమేశ్ అరోరా ప్రకటించారు. అంతేకాక ప్రజాభీష్టం మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేసే దిశగానూ చర్యలు చేపడతామని ఆయన బుధవారం నాటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ విషయంలో తాము ప్రజల అభిప్రాయానికి విలువిస్తామని చెప్పారు. బీజేపీకి ఓటేస్తే, రాష్ట్రంలో తమకు మరింత భద్రత లభిస్తుందన్న కాశ్మీరీల అభిప్రాయంపై విలేకరుల ప్రశ్నలకు స్పందించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
"బీజేపీ మతతత్వ పార్టీ అనే భావన సరికాదు. కాశ్మీర్ అనేది సున్నీ సాధువుల నేల. మా హయాంలో రాష్ట్రంలో ఇస్లాం మెరుగైన వృద్ధి సాధిస్తుంది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుంది. కాశ్మీరీ సంస్కృతికి బీజేపీ ప్రమాదకరమన్న భావనలోనూ వాస్తవం లేదు. అలా ప్రచారం చేసే వారే అత్యంత ప్రమాదకారులు" అని ఆయన అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ 44 సీట్ల మార్కును దాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి