కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కన్న కూతురినే హతమార్చిన విషాద సంఘటన దక్షిణ ఢిల్లీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వెంకటేశ్వరా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని భావనా యాదవ్ (21) ప్రభుత్వ ఉద్యోగి అభిషేక్ సేథ్ (24)ను ప్రేమించి ఈనెల 12న ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళితో తమ పరువు పోయిందని భావించిన భావన తల్లిదండ్రులు జగ్మోహన్ యాదవ్, సావిత్రిలు 14వ తేదీన వారి ఇంటికి వెళ్లి, ఈ వివాహానికి ఒప్పుకుంటున్నామని, ఘనంగా రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూతుర్ని వెంట తీసుకువెళ్లారు. ఆ రాత్రే ఆమెను హతమార్చారు. ఆ తరువాత కూతుర్ని పాము కరిచింది అని ఇరుగు పొరుగు వారితో చెప్పి స్వగ్రామానికి తీసుకువెళ్ళి దహనం చేశారు.
అభిషేక్ ఫిర్యాదు మేరకు భావన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ కమీషనర్ సుమన్ గోయల్ తెలిపారు. తక్కువ కులం వాడిని వివాహం చేసుకొని బంధువుల ముందు తాము సిగ్గుపడేలా చేసినందుకే కూతురిని చంపామని వారు పోలీసుల ముందు అంగీకరించారు. అయితే ఆమెను ఎలా చంపారన్న విషయమై విచారణ జరుపుతున్నట్టు గోయల్ తెలిపారు. ఆమెను దహనం చేసిన చోటు నుంచి సేంపిల్స్ సేకరించి డి.ఎన్.ఎ. పరీక్షకు పంపినట్టు తెలిపారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి