అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల శ్రేయస్సే తమకు ప్రధానమని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ రోజు కార్మిక శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కార్మిక సంఘాలు ఇచ్చిన 10 డిమాండ్లపై అధికారులతో ఆయన చర్చించారు. కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో సంస్కరిస్తామని చెప్పారు. అయితే, కార్మికుల సంక్షేమాన్ని పణంగా పెట్టి చట్టాలను మార్చమని తెలిపారు.