సంచలనాలకు మారుపేరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో కొత్త వివాదానికి తెరలేపాడు. ఈ సారి ఏకంగా దేవుడినే వివాదంలోకి లాగాడు. తెలంగాణ ప్రజలకు తమ సొంత దేవుడు యాదగిరి నరసింహస్వామి ఉండగా... ఆంధ్రా వాళ్ల దేవుడైన తిరుపతి వేంకటేశ్వరస్వామిని పూజించడం సరైనదేనా? అని ప్రశ్నించాడు. తెలంగాణ ప్రజలు తిరుపతి వెంకన్నను మొక్కితే... యాదగిరి నరసింహుడిని అవమానించినట్టు తాను భావిస్తానని ట్వీట్ చేశాడు. సొంత దేశాన్ని ప్రేమించినట్లే సొంత దేవుళ్లను పూజించాలి తప్ప పొరుగు రాష్ట్రాల దేవుళ్లను కాదని చెప్పాడు.
తెలంగాణ ప్రజలు వేంకటేశ్వరస్వామి కంటే యాదగిరి నరసింహస్వామిని తక్కువగా దర్శించుకుంటారని తాను అనడం తప్పుకాదు కదా? అని కూడా వర్మ ప్రశ్నించాడు. యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ అనడం తనకెంతో సంతోషం కలిగించిందని... దీంతో, తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడి విలువను గ్రహిస్తారని మరో సెటైర్ విసిరాడు. ఈ వ్యాఖ్యలపై ఎంత రాద్ధాంతం జరుగుతుందో వేచి చూడాలి మరి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి