ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు హైదరాబాదులోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. వ్యయం, వసతుల దృష్ట్యా ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ సమావేశాల కోసం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని భవనాలను స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి ఇటీవలే పరిశీలించిన సంగతి తెలిసిందే.