ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చెన్నైలో సమావేశమైంది. ఐసీసీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ సహ యజమాని ఎన్.శ్రీనివాసన్ కు ఈ సందర్భంగా బీసీసీఐ బాసటగా నిలిచింది. ఆయనపై ఆరోపణలన్నీ అవాస్తవాలని బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. కమిటీ నివేదికపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మీడియాతో మాట్లాడారు.
కాగా, ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరరామన్ బుకీలతో టచ్ లో ఉండేవాడని ముద్గల్ కమిటీ తన నివేదికలో పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజా సమావేశంలో బోర్డు సభ్యులకు సుందరరామన్ వివరణ ఇచ్చారు. దీంతో, సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ఆయనకు సాయపడాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన గురునాథ్ మెయ్యప్పన్ (శ్రీనివాసన్ అల్లుడు) మాత్రం సుప్రీంలో వారి కేసులను వారే చూసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి